మరోసారి తన మానవత్వలేమిని చాటుకున్న టీడీపీ

మరోసారి తన మానవత్వలేమిని చాటుకున్న టీడీపీ

Saturday, 17th Nov 2018

దివ్యాంగులను ప్రత్యేక శ్రద్ధతో చూడాలని మానవ సమాజానికి ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. కాని మానవత్వం పూర్తిగా నశించి, సహృదయులే లేని టీడీపీకి ఈ విషయం అస్పష్టమని అర్ధమవుతోంది. ఇటీవలే జరిగిన ఒక ఉదంతం ఇందుకు ఉదాహరణగా నిలిచిందని చెప్పొచ్చు.

తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించి పెళ్లిచేసుకున్న దివ్యాంగులు సంతోష్ మరియు పూజ, ఆర్ధిక సహాయం కోసం చంద్రన్న పథకాన్ని ఆశ్రయించాలని భావించారు. ఈనేపథ్యంలోనే అధికారులను సంప్రదించగా వారికి విముఖతే ఎదురైంది. దీనితో వారు సచివాలయంకు వెళ్లి చంద్రబాబు సహాయాన్ని అర్ధించాలని భావించగా అక్కడ కూడా తిరస్కరణకు గురై తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీనితో వారు జనసేన నేతలను సంప్రదించగా వారు పవన్ కళ్యాణ్ని కలిపించి ఆర్ధిక సహాయం అందేలా చేస్తామని మాటిచ్చినట్లు సమాచారం.

అనంతపురంలో జనసేన కరపాత్రల పంపిణీ

అనంతపురంలో జనసేన కరపాత్రల పంపిణీ

Saturday, 17th Nov 2018

ప్రస్తుతం గోదావరి జిల్లాలో యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్న పవన్ త్వరలోనే సీమ యాత్రను కూడా చేపట్టబోతున్నారు. అయితే ఈలోపే అక్కడి జనసైనికులు పవన్ ప్రకటించిన ప్రీ మేనిఫెస్టోని ప్రజల దృష్టికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు.

ఇందుకోసం వారు అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిని వేదికగా చేసుకుని పవన్ ఇదివరకే ప్రకటించిన 12 సూత్రాలను కరపత్రాల ద్వారా ప్రజలలోకి తీసుకువెళుతున్నారు. ఈ జనబాట కార్యక్రమాన్ని ఎన్.ఆర్.ఐ నాగేందర్ మరియు బొంగరం శీను నేతృత్వంలో చేస్తుండగా అధిక సంఖ్యలో ప్రజలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈక్రమంలోనే పవన్ సీమ యాత్ర చేపట్టేలోపు కరపత్రాల ద్వారా జనసేనపై ప్రజలలో చైతన్యం వస్తుందని జనసైనికులందరూ భావిస్తున్నారు.

విద్య వైద్యం కాకుండా మధ్యపానమే ఎందుకు ? : పవన్ కళ్యాణ్

విద్య వైద్యం కాకుండా మధ్యపానమే ఎందుకు ? : పవన్ కళ్యాణ్

Friday, 16th Nov 2018

రాష్ట్రానికి కావలసిన ఉత్తమనాయకుడిని తానే అని రోజు రోజుకూ నిరూపిస్తున్న పవన్ తన ప్రసంగంలో ప్రజల సమస్యలపై గళమెత్తుతూ రాజనగరంలో గర్జించారు.

ప్రభుత్వంలోని వైఫల్యాలను మరొక్కసారి ప్రస్తావిస్తూ యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు అతని కుమారుడు లోకేష్ బాబుకు మద్యంపై ఉన్న దృష్టి విద్య వైద్యంపై లేదని అన్నారు. ప్రజలకు పనికివచ్చే వాటిని వాణిజ్య వ్యక్తులకు ఇచ్చేసి ప్రజలకు హానీ తలపెట్టే మద్యాన్ని చంద్రబాబు తన నాయకుల ద్వారా నిర్వహించడాన్ని పవన్ తప్పుబట్టారు. ప్రజలు విజ్ఞానవంతులయితే చంద్రబాబు ఆటలు సాగవని పేర్కొన్న పవన్ ఇప్పటివరకూ వారు మారతారన్న ఎదురుచూపులు చాలని, వచ్చే ఎన్నికలలో జనసేన అధికారంలోకి రావడం తథ్యం అని ఉద్ఘాటించారు.

పవన్ కాన్వాయిని గుద్దిన ఇసుక లారీ

పవన్ కాన్వాయిని గుద్దిన ఇసుక లారీ

Friday, 16th Nov 2018

రాజానగరం సభను ముగించుకుని వస్తున్న పవన్ కాన్వాయికి నిన్న రాత్రి జరిగిన ప్రమాదం జనసైనికులందరిలో కలవరపాటును రేపింది. ఒక ఇసుక లారీ తమ నాయకుడి కాన్వాయిని గుద్దడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అయితే జననాయకుడికి పెద్ద నష్టమేమీ జరగకపోయినా డ్రైవరుతో పాటు కొంతమంది సెక్యూరిటీ సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్ష్యుల ప్రకారం పెద్ద ఇసుక లారీ తప్పుడు మార్గం గుండా వస్తూ పవన్ కాన్వాయిని ఢీ కొన్నట్లు తెలుస్తోంది. గాయాలైనవారిని జి.ఎస్.ఎల్ ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం వారికి ప్రమాదమేమీ లేదని వైద్యులు ధృవీకరించారు. ఇకపోతే జనసేన నాయకులందరూ సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఉదంతంపై మరింత సమాచారం రావలసి ఉంది.

సీఎం అనే పదం నాలో బాధ్యతను  గుర్తుచేస్తుంది : పవన్ కళ్యాణ్

సీఎం అనే పదం నాలో బాధ్యతను గుర్తుచేస్తుంది : పవన్ కళ్యాణ్

Thursday, 15th Nov 2018

ఈ రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ నాయకులలో సమాజం పట్ల ఎంతో నిబద్దత కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఆయన ప్రతి సభకు భారీగా తరలి వస్తున్న జనాన్ని చూస్తే ఎవరికైనా ఇది వాస్తవమనక తప్పదు. అందుకే పవన్ అభిమానులందరూ కూడా ఆయన కనిపించినప్పుడల్లా సీఎం అని అరుస్తూ తమ ఆకాంక్షను వెల్లబుచ్చుతున్నారు.

కాకినాడలో జరిగిన బహిరంగ సభలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వారు అరిచే సీఎం అనే పదం సమాజం పట్ల తనకున్న బాధ్యతను గుర్తుచేస్తుంది పవన్ అన్నారు. ఏదో ఒకరోజు వారి ఆకాంక్షే మంత్రమై వాస్తవరూపం దాల్చుతుందని, అందుకు కాకినాడ సాక్షిగా నిలుస్తుందని తీర్పుచెప్పారు. ఈక్రమంలోనే వచ్చే ఎన్నికలలో జనసేనకు కాకినాడ నుండి ఎమ్మెల్యే మరియు ఎంపీ సీట్లు కలిపి 7 పదవులు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఇది నాకు నేను పెట్టుకున్న పరీక్ష : పవన్ కళ్యాణ్

ఇది నాకు నేను పెట్టుకున్న పరీక్ష : పవన్ కళ్యాణ్

Thursday, 15th Nov 2018

పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో మూడు విడతల ఎన్నికలను చూసారు. ఈ పదిహేను సంవత్సరాల కాలంలో కేవలం ప్రజల సమస్యలను తెలుసుకోవడంలోనే కాకుండా ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడంలో కూడా అనుభవాన్ని సాధించారు.

అనపర్తిలో జరిగిన బహిరంగ సభలో ఇదే విషయాన్ని వెల్లడిస్తూ కులమతాలకు అతీతంగా పనిచేయడానికి ఇది తనకు తాను పెట్టుకున్న సామజిక పరీక్ష అని అన్నారు. ఇదే సమయంలో తాను ప్రజల సమస్యలపై పనిచేస్తుంటే టీడీపీ నాయకులు తనను విమర్శించినంత ఎక్కువగా ఎవరూ విమర్శించలేదని అన్నారు. ఈ విషయంలో పరిధులను దాటి మరీ తాము పోషిస్తున్న మీడియా ద్వారా తన తల్లిని తిట్టించడానికి కూడా వారు వెనుకాడలేదని అభియోగించారు. వీటికంటే సదరు మీడియా వారు వంతాడ మైనింగ్ వంటి సమస్యలపై దృష్టిపడితే బాగుండేదని పవన్ అన్నారు. అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ పథకానికి పొట్టి శ్రీరాములు, డొక్క సీతమ్మ వంటి సామాజికవేత్తల పేర్లు పెట్టకుండా ఎదో వారి సొంత డబ్బులు పెట్టినట్లు చంద్రన్న పేరు పెట్టడమేమిటని పవన్ ప్రశ్నించారు.

యువతను బిచ్చగాళ్ళలా చూడకండి : పవన్ కళ్యాణ్

యువతను బిచ్చగాళ్ళలా చూడకండి : పవన్ కళ్యాణ్

Saturday, 10th Nov 2018

ప్రభుత్వం యువత నుండి పొందే లబ్ధి కంటే యువత ప్రభుత్వం నుండి పొందే లబ్ధి చాలా తక్కువ, అసలుండదు అంటే సబబేమో ? ఎప్పుడు కూడా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఏదో ఒక ఆశ జూపి పదవిలోకి వచ్చిన తరువాత కావాలనే వారిని గాలికి వదిలేయడం పరిపాటే.

ప్రస్తుతం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం కూడా అలానే చేస్తోంది. అందుకే యువత తరపున ప్రశ్నిస్తున్న జననాయకుడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో చంద్రబాబు ఇస్తానన్న ఉద్యోగాల హామీ గురించి అడగడమే కాకుండా ప్రతి నిరుద్యోగికి 1500 రూపాయలు ఇచ్చి వారిని బిచ్చగాళ్లలా చూడకండని కోరారు. ఒకవేళ చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా నిరుద్యోగి అయ్యి ఉంటే, ఆయనకు కూడా ఇలానే భిక్షం వేసేవారా అని పవన్ ప్రశ్నించారు.

కంఠం కోసుకుంటా కాని ఆ పని చేయను : పవన్ కళ్యాణ్

కంఠం కోసుకుంటా కాని ఆ పని చేయను : పవన్ కళ్యాణ్

Saturday, 10th Nov 2018

జనసేన వలనే తమకు అధిక ముప్పు ఉందని తెలుసుకున్న టీడీపీ నాయకులు లేని అవకాశాన్ని కూడా సృష్టించుకుని మరీ పవన్ గురించి అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఎంచుకున్న మంత్రం, పవన్ మోడీ దత్త పుత్రుడు అనేది.

వీటిపై ఘాటుగానే స్పందించిన పవన్ తన సొంత అన్ననే కాదనుకుని వచ్చినపుడు మోడీ ఎంత అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆత్మగౌరవం కోసం తాను ఎవరి ముందు తల వంచనని అన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే గొంతు కోసుకుంటాను కాని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేదిలేదని తేల్చి చెప్పగా సభలో గుమిగూడిన జనం హర్షధ్వానాలతో మద్దతు తెలిపారు. ఈ రకంగా పవన్ తనపై వెల్లువెత్తుతున్న ప్రతి విమర్శను తిప్పికొడుతూ ముందుకు సాగుతుండడం కార్యకర్తలలలో కూడా నూతనోత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం పవన్ ఈ నెల 12న జరుగబోయే తన తదుపరి యాత్ర కోసం సమాయత్తం అవుతున్నారు.