పవన్ అంటే టీడీపీకి ఎందుకంత భయం ?

పవన్ అంటే టీడీపీకి ఎందుకంత భయం ?

Saturday, 17th Nov 2018

సమృద్ధిగా పండ్లను ఇచ్చే చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువ అనే సామెత తెలుగు ప్రజలకు చిరపరిచితమే. సమాజంలోని ఆకలిని రూపుమాపడానికి స్వార్ధం ఎరుగని చెట్టు తనవంతు సహాయం చేస్తుంటే ఇంకా కావాలనే మనిషిలోని ఆశ దానిని రాళ్ల దెబ్బలకు గురిచేస్తోంది. రాజకీయంలో నీతి, నిబద్దత కలిగిన నాయకులు ఇటువంటి చెట్లతో సమానమే. వారు భావితరానికి అందించే ఫలాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయి. అయితే దుర్మార్గ రీతిలో సంపాదించడం మొదలుపెట్టిన స్వార్ధ రాజకీయ నాయకులు అటువంటి నిస్వార్ధ నాయకులపై రాళ్లు రువ్వడం నేడు అత్యంత సహజమైపోయింది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నాయకులు అనుసరిస్తున్న విధానం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది.

అప్పట్లో నందమూరి తారకరామారావు స్థాపించిన టీడీపీ మహావృక్షమై ఎంతమందికో ఆదర్శప్రాయంగా నిలువగా, ప్రస్తుతం చంద్రబాబు అధ్యక్షతన ఎందరో స్వార్ధపరులకు నీడనిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే దీనిని పవన్ గ్రహించగా, వెంటనే తన మద్దతును ఉపసంహరించుకుని టీడీపీ అధికారుల అవినీతిని బట్టబయలు చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు పవన్ నీతి, నిబద్దతతో కూడిన నాయకుడని పొగిడిన స్వార్ధపూరిత టీడీపీ నాయకులే ఇప్పుడు ఆయన ఎదురుతిరిగే సరికి తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. తన అసంఖ్యాక అభిమాన గణంతో గత ఎన్నికలలో విజయాన్ని అందించిన పవన్ ఇలా ఎదురుతిరిగే సరికి టీడీపీ నాయకులకు వచ్చే ఎన్నికల విజయంపై నమ్మకం సన్నగిల్లిందని చెప్పవచ్చు.

ఇకపోతే టీడీపీ నాయకులను కలవరపెట్టే మరో అంశం పవన్ కులం. తాను ఏ కులానికీ చెందినవాడిని కానని పవన్ వెల్లడించినా, కులాలను ఏకం చేయడమే తన లక్ష్యమని ఉద్ఘాటించినా రాష్ట్రంలోని ఒక వర్గం ప్రజలు ఆయన పక్షానే నిలుస్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇందుకు కారణం కూడా గత తరం నాయకులే అని చెప్పవచ్చు. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న వారి కులానికి సీట్ల కేటాయింపుతో మొదలుకుని అనేక విషయాలలో తరతరాలుగా అన్యాయం జరుగుతూ వస్తోందని ఆ వర్గ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ టీడీపీ నుండి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ వర్గం ఓట్లు తమకు ప్రతికూలంగా మారతాయని టీడీపీ కలవరపడుతోంది.

2009 ఎన్నికలలో టీడీపీ ఓటమికి ప్రధాన కారణం కూడా ఇదే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సంవత్సరాల తరబడి ఏలిన అవినీతి నాయకులను చూసి విసిగిపోయిన సామాన్య జనం నిజాయితీ గల నాయకుడి కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో నిస్సందేహంగా పవన్ ఒక ఆశాకిరణమనే చెప్పొచ్చు. అందుకే ఆయనలో ఏ గుణాన్ని కూడా వంకబెట్టలేని టీడీపీ నాయకులు పచ్చ మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తిగత విషయాలతో దాడికి సిద్దపడుతున్నారు. మరి ఆకలి తీరే వరకు పవన్ నీడన ఉన్న వీరు, అవసరం తీరగానే రాళ్లు రువ్వడాన్ని ప్రజలు ఎంతవరకు భరిస్తారనేది వచ్చే ఎన్నికలతో కాని తేలదు.

ఇది సందిగ్ధమా లేక వ్యూహమా ?

ఇది సందిగ్ధమా లేక వ్యూహమా ?

Saturday, 10th Nov 2018

ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలకు ఇంకా అయిదు నెలలు మాత్రమే మిగిలుండగా ప్రతి ఆంధ్రుడిలో కూడా ఫలితాల గురించి ఇప్పటినుండే ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మూడు ప్రాంతీయ పార్టీలకు కూడా సమాంతర ప్రాచుర్యం కలగడం బహుషా రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇదే ప్రథమం అయ్యి ఉంటుంది. అయితే సామాన్య ప్రజల దృష్టి కోణం నుండి చూస్తే, ఎక్కువ ప్రజల మద్దతు కూడగట్టుకున్న పార్టీగా జనసేనకే వచ్చే ఎన్నికలలో చక్రం తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2014, మార్చ్ 14న జనసేన పార్టీని స్థాపించిన పవన్ చంద్రబాబుకు మద్దతు తెలిపి ఆయన అనుభవం రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడుపుతుందని భావించారు. అయితే ఆయన అంచనా తప్పి చంద్రబాబు అవినీతి పాలన ముందు ఆయన అనుభవం ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఈక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా రాష్ట్ర పర్యటన చేపట్టిన పవన్ అధికారంలో లేకుండానే, ఒక్క సీటు కూడా గెలవకుండానే ఉద్దానం కిడ్నీ సమస్య, టిట్లి బాధితుల దీనావస్థ, వంతాడ అక్రమ తవ్వకం మరియు సెజ్ బాధితుల గోడు వంటి పలు సమస్యలను ప్రపంచ దృష్టికి తీసుకువచ్చారు.

ఈక్రమంలోనే తన నిజాయితీ మరియు నిబద్దతతో అటు అధికార పక్షంలోని చంద్రబాబును, ఇటు ప్రతి పక్షంలోని జగన్ మోహన్ రెడ్డిని మరిపిస్తూ ప్రజలకు సరైన నాయకుడిగా పవన్ రూపుదిద్దుకున్నారు. ప్రస్తుతం ప్రజాపోరాట యాత్రలో పాల్గొంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న పవన్ ముగ్గురిలో తానే ఉత్తమమైన నాయకుడిగా నిరూపిస్తుండగా ప్రజలు కూడా అతడిని ఆమోదించడం విపక్షాలను కలతపెట్టే అంశమే. అయితే సాధారణ ప్రేక్షకుల నుండి అసంఖ్యాక అభిమాన గణంలో మెదులుతున్న ఏకైక ప్రశ్న, 2019లో పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తారు ? అనేది.

గతంలోనే పవన్ ఆంధ్రరాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో పోటీకి జనసేన సిద్ధమని వెల్లడించారు, కాని తాను పోటీ చేయబోయే స్థానం గురించి ఖచ్చితంగా చెప్పలేదు. జనవరిలో తన మొదటి ఆంధ్రా పర్యటన చేపట్టినప్పుడే తాను అనంతపూర్ నుండి పోటీ చేస్తానని పవన్ అన్నారు. ప్రజలతో పాటు దాదాపు ప్రతిపక్షాలన్నీ పవన్ అక్కడి నుండే పోటీ చేస్తారని భావించాయి. అయితే కొన్ని రోజులకే పార్టీ మేధావుల ప్రకారం పవన్ కృష్ణా జిలా అవనిగడ్డను కూడా తాను పోటీ చేయబోయే స్థానాలలో ఒక భాగంగా భావిస్తున్నారని తెలిసి ఖంగుతిన్నారు. ఇక కొన్ని మీడియా సంస్థలు పవన్ తిరుపతి నియోజకవర్గం వైపు మొగ్గు చూస్తున్నారని కథనాలు ప్రసారం చేసి మరింత గందరగోళాన్ని సృష్టించాయి.

ఇటీవలే పవన్ తుని, పిఠాపురం ప్రాంతాలలో పర్యటించినపుడు కూడా తాను ఇక్కడి నుండి పోటీ చేసే విషయంపై చర్చిస్తున్నానని అనడంతో అందరిలో తీవ్రమైన సందిగ్ధత నెలకొంది. ఈనేపథ్యంలోనే ఒక నాయకుడు ఇన్ని స్థానాలలో పోటీ చేయడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు విషయానికి వస్తే, ఇదంతా పవన్ రాజకీయ వ్యూహంలో భాగమే అని పార్టీ అంతర్గత నాయకులు తెలుపుతున్నారు. ఇప్పటికే పవన్ పొందుతున్న ప్రాచుర్యం చూసి ఓర్వలేకపోతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు పవన్ పోటీ చేసే స్థానం గురించి తెలిస్తే అప్రమత్తం అవుతారనే పవన్ ఇలా సందిగ్ధపరుస్తున్నారని వారు తెలిపారు.

అదన్నమాట అసలు విషయం, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి జననాయకుడికి ఎర్ర తివాచీ పరచే నియోజకవర్గం ఏదో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే !

ధైర్యమే పవన్ మొదటి లక్షణం

ధైర్యమే పవన్ మొదటి లక్షణం

Saturday, 3rd Nov 2018

ప్రతి రాజకీయవాది కూడా గొప్ప నాయకుడిగా రూపాంతరం చెందాలని భావిస్తుంటాడు కాని కొద్దిమంది మాత్రమే జన హృదయాలను గెలుచుకుని చరిత్రలో నిలిచిపోగలరు. అందుకు ప్రధాన కారణం సదరు వ్యక్తిలో ఉండే నాయకత్వ లక్షణాలే. ఏ దారిలో వెళితే అభివృద్ధి సాధ్యమవుతుందో నాయకుడికి తెలిసుండాలి, ఆ దారిలో తాను నడవగలనన్న నమ్మకముండాలి, అన్నిటికంటే ముఖ్యంగా తనను నమ్మినవారిని కూడా ఆ దారిలో నడిపించగలగాలి. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకునే ధైర్యం అతనిలో మెండుగా ఉండాలి.

అందుకే ధైర్యం నాయకుని యొక్క ప్రథమ లక్షణం అంటుంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఈ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నవాడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్. తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్ పార్టీలో కలిపినపుడు బహిరంగంగా వ్యతిరేకించిన తీరు కాని, ఎన్నో ప్రతికూలాంశాల మధ్య సొంతంగా జనసేన పార్టీ పెట్టి అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏకిపారేసిన తీరు గాని అతనిలోని ధైర్య గుణాన్ని బహిర్గతం చేసాయి.

అలాగే రాజకీయాలలో రాణించాలంటే సరైన మిత్రులు ఉండాలంటారు రాజకీయ దురంధురులు. ఒక కొత్త పార్టీ పెట్టీ పెట్టగానే బిజెపి వంటి కేంద్ర ప్రభుత్వమే మిత్ర హస్తం అందిస్తే మరే పార్టీ అయినా అణగిమణగి ఉంటుంది. కాని ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి తిరస్కరించిన బిజెపిపై పవన్ తన విమర్శనాస్త్రాలను సంధించి ప్రజా సంక్షేమం కోసం అవసరమైతే మిత్రత్వాన్ని కూడా వదులుకోవడానికి సిద్దమే అని నిరూపించారు. ఇదే సమయంలో అధికార పక్షమైన టిడిపి, కిమ్మనకుండా బిజెపి ఇచ్చిన ప్యాకేజీని తీసుకుని అణగిమణగి ఉన్న విషయం ప్రజలకు విదితమే. ఒక అధికార పక్షం కూడా చేయని సాహసం పవన్ చేసారు, ఇది ఆయనలోని ధైర్యాన్ని చాటే మరో ఉదంతం.

ఇక ప్రతి పార్టీ కూడా ఒక మీడియా సంస్థను తన అధీనంలో ఉంచుకుని వాస్తవాలను అవాస్తవాలుగా చూపిస్తూ, ప్రజలను మభ్యపెట్టి ఓటు రాజకీయాలు చేస్తున్న సమయంలో వాటిని బహిష్కరించమని చెప్పడం మరో సహస ఘట్టం. రాజకీయంలో నిలబడాలంటే ప్రాచుర్యం తప్పనిసరి, అందుకు మీడియా అండదండలు ఉండడం అనివార్యం. ఇటువంటి తరుణంలో వాటిని వ్యతిరేకించి సరైన పేరు కూడా లేని ఒక చిన్న మీడియా సంస్థ ద్వారా తన కార్యకలాపాలను కొనసాగించి విజయం కూడా సాధించడం ఆయనలోని దృఢచిత్తాని తెలుపుతోంది.

స్వర్గీయ నందమూరి తారకరామారావుతో సహా చరిత్రలో నిలిచిపోయిన ఏ నాయకుడిని తీసుకున్నా ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అని పోరాడి నిలిచినవాడే గొప్ప నాయకుడిగా కీర్తింపబడ్డారు. ప్రస్తుతం ఉన్న నాయకులలో ఈ లక్షణం ఉన్న నాయకుడు జనసేనుడే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే నిజాయితీ అతని కవచం, నమ్మకం అతని ఆయుధం, ధైర్యం అతని ప్రథమ లక్షణం.

జనసైనికులకు పవన్ కవాతు పాఠాలు

జనసైనికులకు పవన్ కవాతు పాఠాలు

Monday, 29th Oct 2018

పరిపూర్ణమైన నాయకుడనేవాడు నిరంతరం అభ్యసిస్తూనే ఉంటాడు. తనను తాను పరీక్షించుకుని, తన జ్ఞానానికి పదును పెట్టుకుంటూ ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో గత విజయాలను తలచుకుని అహం పెంచుకుంటే తిరోగమించడం ఖాయం, అదే ఆదర్శంగా తీసుకుని ఒదిగి ఉంటే తాను పురోగమించడంతో పాటు ప్రజలను కూడా సంక్షేమం వైపు నడిపించగలడు. ఈ విషయాలన్నీ బాగా తెలిసినవారు కనుకనే పవన్ కళ్యాణ్ జనసైనికుడయ్యారు.

అభిమానులను, కార్యకర్తలను సమన్వయపరుచుకుంటూ విజయం దిశగా నడిపించడమనేది పరిపూర్ణమైన నాయకుడికి ఉండవలసిన ప్రథమ లక్షణం. ఆ అనుభవం సాధించారు కాబట్టే, కవాతు ద్వారా లభించిన ప్రాచుర్యాన్ని నెత్తికి ఎక్కించుకుని విజయంపై అతి ధీమాగా ఉండరాదని కార్యకర్తలకు సూచించారు పవన్. ఈ నెల 15న ఆయన నిర్వహించిన కవాతు ఇటు జనసేన పార్టీలోనూ అటు ప్రత్యర్థుల అంతరంగంలోనూ రాబోవు ఎన్నికలలో జనసేన విజయాన్ని ఖాయం చేసిందనే చెప్పొచ్చు.

ఈ తరుణంలో తన నుంచి కాని, తన అభిమానుల నుండి కాని ఏవిధమైన పొరపాటు జరిగినా అది రాబోవు ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుంటుందని పవన్ భావిస్తున్నారు. ఇటీవలి కవాతుపై ఆంధ్రప్రభలో వచ్చిన ఒక విశ్లేషణను ఉదాహరణగా చూపిస్తూ ఇదే విషయాన్ని పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కార్యకర్తలకు సూచించారు. ప్రజలు కొత్త రాజకీయాలను కోరుకుంటున్నట్లు కవాతు విజయం తెలుపుతోందని, ఈ సమయంలో కార్యకర్తలు మరింత బాధ్యతతో వ్యవహరించవలసి ఉంటుందని జననేత వివరించారు.

అంతేకాకుండా మార్పును తీసుకురావడానికి వచ్చిన పార్టీగా జనసేన పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడింది. వారి ఆశలను మరియు ఆశయాలను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఇప్పుడు తమపై ఉందని పవన్ కార్యకర్తలకు తెలిపారు. అన్నిటికీ సిద్దపడే రాజకీయాలలోకి వచ్చానని తెలిపిన పవన్ ఇల్లు అలకగానే పండగ రాదని, భవిష్యత్తు కోసం అందరం కలిసి బాధ్యతాయుతంగా పని చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు విన్నవించారు.

పవన్ ఒక్క మాట చెబితేనే ప్రభుత్వం తారుమారైన వేళ ఆయన అందించిన ఈ సందేశం కార్యకర్తలుగా మారిన అభిమానులు అక్షరం తప్పకుండా పాటిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే జనబాట ద్వారా ఎంతో మంది సామాన్యులను తన మద్దతుదారులుగా మార్చుకున్న జనసేన, రాబోవు ఎన్నికలలో అత్యధిక మంది ఆదరణను చూరగొని లాంఛనంగా విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఆకాంక్షిద్దాం.

తెలంగాణలో బహుజన పార్టీకి పవన్ మద్దతు ?

తెలంగాణలో బహుజన పార్టీకి పవన్ మద్దతు ?

Thursday, 25th Oct 2018

పవన్ కళ్యాణ్ ఉన్నఫళంగా లక్నో వెళ్లడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది, ఈ నేపథ్యంలోనే ఒక వార్త రాజకీయ వర్గాలలో సంచలనం కలిగిస్తోంది. అదేమంటే త్వరలోనే తెలంగాణాలో జరుగబోయే ఎన్నికలలో బహుజన పార్టీకి పవన్ మద్దతు తెలుపనున్నారని. గత ఎన్నికలలో ఎక్కువ శాతం ప్రజల మద్దతు లభించిన మూడవ అతిపెద్ద పార్టీగా బహుజన పార్టీకి పేరు ఉంది. ఇప్పటికే తెలంగాణాలో జరుగబోయే ఎన్నికలకు మాయావతి 119 స్థానాలకు తన అభ్యర్థులను నిర్ణయించారు కూడా. పార్లమెంట్ సభ్యుడు వీర్ సింగ్ నేతృత్వాన తెలంగాణాలో బి.ఎస్.పి పోటీ పడనుంది. 2014 ఎన్నికలలో టి.ఆర్.ఎస్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పటికీ రెండు స్థానాలను గెలుచుకుని బి.ఎస్.పి అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పొచ్చు.

ఈ పరిస్థితుల్లో పవన్ మాయావతిని కలవడానికి లక్నో వెళ్లడం రాజకీయ వర్గాలలో అమితాసక్తిని కలిగించింది. కొన్ని నెలల క్రితం తాను తెలంగాణాలో పోటీ చేయకపోయినప్పటికీ ఒక పార్టీకి మద్దతు తెలుపుతానని పవన్ స్పష్టం చేశారు. మరోవైపు వచ్చే ఎన్నికలలో ప్రధాన అభ్యర్ధికి పోటీపడే వారిలో మాయావతి కూడా ఒకరు, ఇప్పటికే ఆమె వివిధ ప్రాంతీయ పార్టీలను కలుపుకునిపోతుండగా జనసేనతో పొత్తు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసివస్తుందని భావించినట్లు సమాచారం.

పవన్ కూడా ఆంధ్ర ప్రజల మద్దతు కూడగడుతూ కులాల ఐక్యత అనే కొత్త నినాదంతో ముందుకు వెళుతున్నారు. గతంలో అన్ని పార్టీలు కూడా ఏదో ఒక కులానికే మొగ్గు చూపి తమ ఓటు బ్యాంకును సంరక్షించుకునే దిశగా అడుగులు వేస్తే, సరికొత్త ఆలోచనతో పవన్ అనగారిన వర్గాలను ఆకర్షించారనే చెప్పాలి. ఇటు బి.ఎస్.పి కూడా ఎస్.సి, ఎస్.టి, ఓ.బి.సి మరియు ఇతర మైనారిటీ మతాలైన ముస్లిం, క్రిస్టియన్, సిఖ్ మరియు బౌద్ధుల సమ్మేళనంతో దేశంలో పలు రాష్ట్రాలలో పాగా వేసే పనిలో ఉంది. ఈ తరుణంలో జనసేనతో తప్ప మరే పార్టీతో పొత్తు బి.ఎస్.పికి లాభసాటిగా ఉండదేమో.

పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మరో కారణం ప్రత్యేక హోదా విషయమై నరేంద్ర మోడీ మాటతప్పడమే. ఒకవైపు కాంగ్రెస్ అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేస్తే ప్రత్యేక హోదా ఇస్తానని ఆశ చూపి మరీ మోడీ మోసం చేశారు. ఈ విషయమే జననాయకుడికి ఆగ్రహం తెప్పించి, సాంప్రదాయ పార్టీలకు ధీటుగా మాయావతి వంటి మరో ప్రత్యామ్నాయ శక్తిని నిలబెట్టాలని భావించినట్లు తెలుస్తోంది.

మరి ఈ తరుణంలో పవన్ పరిస్థితి తెలంగాణాలో ఏ విధంగా ఉండబోతోంది ? గతంలో ఆయన తెలంగాణాలో కె.సి.ఆర్ పరిపాలన బాగుందని పలుమార్లు కితాబిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరిప్పుడు ఆయన టి.ఆర్.ఎస్ పార్టీని కాదని బి.ఎస్.పికి మద్దతిస్తారా ? అనేది ప్రతి తెలంగాణ వ్యక్తిలో మెదులుతున్న ప్రశ్న. ఒకవేళ అలా చేస్తే, ఈ వారమే మొదలుకానున్న బి.ఎస్.పి ప్రచారంలో ఆయన పాల్గొంటారా ? ఈ ప్రశ్నలకు రాబోయే కాలం ఎటువంటి సమాధానాలను ఇస్తుందో వేచి చూడాల్సిందే !

మీడియా చెంప చెళ్లుమనిపించిన పవన్

మీడియా చెంప చెళ్లుమనిపించిన పవన్

Wednesday, 24th Oct 2018

ప్రస్తుతం ప్రసారమాధ్యమాలలో నైతికతకు అర్ధం లేకుండా పోయిందనేది అందరూ అంగీకరించే విషయం. అనవసరమైన విషయాల పట్ల వారు సాగించే చర్చలు, పిల్లల మనస్తత్వంపై ప్రభావం పడుతుందనే విచక్షణ లేకుండా, నగరంలో జరిగిన హత్యలను పదే పదే చూపించే తీరు అర్ధరహితం. కేవలం టి.ఆర్.పి రేటింగులే పరమావధిగా సాగుతున్న ప్రస్తుత మీడియా అందుకోసం ఎంత దూరమైనా వెళుతుందని నిరూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రసార మాధ్యమాలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు, గత కొన్ని నెలలుగా అత్యధిక టి.ఆర్.పి రేటింగులు సాధించడానికి వారికి లభించిన వ్యక్తి పవన్ కళ్యాణ్.

ఇటీవలి కాలంలో మీడియా అనవసరమైన విషయాలకి పవన్ కళ్యాణ్‌ను వివాదంలోకి లాగుతోందనేది ప్రతి సామాన్య తెలుగువాడికి తెలిసిన విషయమే. అది శ్రీరెడ్డి వివాదం అయినా లేక కత్తిమహేష్ ఉదంతమైనా పవన్ కళ్యాణ్‌ను ప్రతినాయకుడిగా చూపించే ప్రయత్నం జరిగింది. ఈ వివాదాల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని భావిస్తున్నా, ప్రసార మాధ్యమాల తీరు సగటు ప్రేక్షకుడికి విసుగు తప్పించి మీడియాపై పూర్తి విశ్వాసం కోల్పోయేలా చేసాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఆఖరుకి సామాన్యుల సమస్యలపై తప్పితే సహనం కోల్పోని పవన్ కళ్యాణ్ కూడా అనవసరంగా తన తల్లిని వివాదంలోకి లాగేసరికి ఆగ్రహించి మీడియాపై పరోక్ష యుద్దానికి దిగారు. ఈ క్రమంలోనే తన అభిమానులకు మరియు మద్దతుదారులకు ఆయా మీడియా సంస్థలను బహిష్కరించవలసిందిగా కోరడంతో ఆ యొక్క ఛానెళ్ల టి.ఆర్.పి రేటింగులు అమాంతం పడిపోయాయి. ఈ ఉదంతం పవన్ అభిమాన గణానికి ఉన్న బలమెంతో తెలుపడమే కాకుండా ప్రజలు సదరు మీడియా సంస్థలపై ఎంత విసుగు చెంది ఉన్నారో తెలుపుతోంది.

ఇదే సందర్భంలో ఎవరూ ఊహించలేని కార్యక్రమాన్ని రూపొందిస్తానని సదరు మీడియాపై పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సవాల్ విసరడం అందరిలో ఆసక్తిని కలిగించింది. ప్రస్తుతం శ్రీకాకుళాన్ని కబళించిన టిట్లి తుఫాను ఆయనలోని మానవత్వాన్ని వెలికితీసి పరోక్షంగా అప్పటి సవాలుకు సమాధానంగా నిలిచిందని చెప్పాలి. ఇది యాధృచ్చికమే అయినా, పవన్ అనుకుని చేసినది కాకపోయినా ప్రజలకి కష్టం వచ్చిన సమయంలో ఒక మీడియా ప్రతినిధి ఏవిధంగా ఉండాలో ఆయన స్వయంగా చూపించిన తీరు మెచ్చుకోదగ్గ విషయం.

టిట్లి తుఫాను శ్రీకాకుళం జిల్లా వైభవాన్ని తుడిచిపెట్టి వేయగా ఆంధ్ర ప్రభుత్వం అంతా బానే ఉందని చేతులు దులుపుకున్న తరుణంలో పవన్ అక్కడ పర్యటించారు. అయితే ప్రభుత్వం చెప్పిన దానికి భిన్నంగా అక్కడి పరిస్థితులు ఉండగా పవన్ స్వయంగా తన మొబైల్ ఫోన్ ద్వారా సామాన్యుల ఇక్కట్లను చిత్రీకరించి ప్రపంచానికి తెలియజేసారు. ఒక విధంగా ఆయనే ఆ ప్రాంతానికి విలేఖరి అయ్యారని చెప్పాలి. ఇది పవన్ కావాలని చేసినది కాకపోయినా, లాలూచి పడే ప్రభుత్వాధికారులకు అండగా నిలిచే సదరు మీడియా వారికి ఇది నిస్సందేహంగా ఒక చెంప పెట్టు లాంటి సమాధానమే.

పర్వతం ఒకరి ముందు మోకరిల్లదు

పర్వతం ఒకరి ముందు మోకరిల్లదు

Monday, 22nd Oct 2018

సినీ రంగమైనా లేక రాజకీయ రంగమైనా ప్రజలెప్పుడూ ఉన్నత వ్యక్తిత్వంగల వారినే ఆరాధిస్తారు. తమ ఆరాధ్య నాయకుడిలో తమను తాము చూసుకుంటూ మురిసిపోవడమే కాక అవసరమైతే ఒకరిని ఎదిరించగలరు లేదంటే ప్రాణత్యాగమైన చేయగలరు. దీనిని కొంతమంది వెర్రి అంటే మరి కొంతమంది పరిమితులు లేని ఆరాధనా భావమని కొనియాడుతుంటారు. దశాబ్దాల తరబడి ఈ విధంగా ప్రభావితం చేయగల నాయకులు అతికొద్దిమందే ఉండగా వారిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటారనడం సమంజసమే.

చిన్న మందుసీసా, చేతిలో చిల్లర పెట్టంది ఓట్లు రాలని ఈ కలికాలంలో కేవలం ఒక్క మాటతో అభిమానులను ప్రభావితం చేసి, ధవళేశ్వరం వంతెనపై లక్షలాది మందిని కవాతు చేయించిన ఘనత ఈ కాలంలో పవన్ కళ్యాణ్‌కు తప్ప ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదేమో. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా తమ సభలకు జనసమీకరణ పేరుతో కొంత డబ్బును కేటాయించడం చూస్తే ఎవరికైనా ఇది వాస్తవమే అనిపించకమానదు. అయితే అతనొక సినీ కథానాయకుడు, అందుకే చూడటానికి జనం వచ్చారని తెలుగుదేశం నాయకులు పదే పదే అనడం వారి ఈర్ష్యను తెలియజేస్తోంది.

గత ఎన్నికలలో టిడిపి, వైసిపి మధ్య నువ్వా నేనా అన్నట్లున్న సమయాన పవన్ చెప్పిన ఒక్క మాట టిడిపిని గెలిపించింది. ఈ విషయాన్ని స్వయానా అధికార పక్షమే చెప్పడం చూస్తే పవన్ కథానాయకుడి స్థాయి నుండి జననాయకుడిగా ఎప్పుడో మారిపోయాడని వేరే చెప్పక్కర్లేదు. మరి అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి ఇప్పుడు టిడిపికి ఎందుకు బద్ద శత్రువుగా మారడు అంటే, ఆయనను అభిమానించే వారి నుండి వచ్చే ఒకే ఒక్క సమాధానం నిబద్దత.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అనుభవమైన నాయకుడు కావాలని పవన్ భావించగా, చంద్రబాబు పోయిన ఎన్నికలలో వెల్లడించిన హామీలనే నెరవేర్చకపోవడం ఆయనకు కోపం తెప్పించింది. పైగా ప్రత్యేక హోదా సమయంలో కేంద్రంతో చంద్రబాబు రాజీపడిన యత్నం ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. ఈక్రమంలోనే చంద్రబాబు బాధ్యతారాహిత్యంతో కూడిన పాలన అవినీతి నాయకులకు అండగా ఉందే తప్ప సామాన్యుడికి, ముఖ్యంగా యువతకు చేయూతనిచ్చే విధంగా లేదనేది పవన్ వాదన.

ఇందులో భాగంగానే ప్రజల పక్షాన నిలిచేందుకు ఇటు రాష్ట్రంతోనూ అటు కేంద్రంతోనూ శత్రుత్వం పెంచుకున్నారు పవన్. అతని తొణకని ధైర్యం, బెణకని ఆత్మ విశ్వాసంతో కూడిన వ్యక్తిత్వమే రేపు వచ్చే ఎన్నికలలో సంచలనం సృష్టించే అభిమానులను సంపాదించిపెట్టాయి. లక్ష్యం దూరమైనా, దారి చీకటిగా ఉన్నా గుండె నిండా ధైర్యంతో ఉండే పవన్ వాటిని పట్టించుకోకుండా ప్రజల క్షేమమే ముఖ్యంగా సాగుతున్నారు. ఈ విధంగా మొన్న కవాతులో ఆయన చెప్పినట్లు పర్వతం ఒకరి ముందు మోకరిల్లదు అని నిరూపిస్తున్నారు.

తెలంగాణలో పవన్ చూపు ఎవరి వైపు ?

తెలంగాణలో పవన్ చూపు ఎవరి వైపు ?

Saturday, 13th Oct 2018

జనసేన పార్టీని స్థాపించిన తరువాత తెలంగాణను కాదని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. ఇందుకు ప్రధాన కారణం విభజన తరువాత తెలంగాణ కంటే ఆంధ్రరాష్ట్రమే ఆర్ధికంగా వెనుకబడి ఉండటం. అందునా తెలంగాణాలో అప్పటికే టి.ఆర్.ఎస్ పార్టీ తన విజయాన్ని ఖరారు చేసుకోగా, కె.సి.ఆర్ తమకు అన్నివిధాలా సరైన నాయకుడని ప్రజలు ప్రగాఢంగా భావించారు. దీనితో ఆంధ్రను దేశంలో అత్యున్నతంగా తీర్చిదిద్దాలంటే నిబద్దతతో కూడిన అనుభవజ్ఞ నాయకుడి అవసరం ఉందని పవన్ భావించారు.

ఈ కారణం చేత పవన్ తెలుగుదేశం పార్టీకి తన మద్దతును ప్రకటించారు కాని ప్రస్తుత పరిస్థితులను ఊహించలేకపోయారు. టి.డి.పి నాయకుల బాధ్యతారాహిత్యమైన అవినీతి పాలన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనికి బాధ్యత వహిస్తూ వచ్చే ఎన్నికలలో మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రాకుండా ఉండేందుకు తన శాయశక్తులా కృషిచేస్తున్నారు పవన్. ఇందులో భాగంగానే తన ప్రజా పోరాట యాత్రలో ప్రజల పక్షాన నిలిచి జన హృదయంలో అత్యున్నత స్థానాన్ని సంపాదించారు. ఇక వచ్చే ఎన్నికలు దీనిని నిర్ధారించవలసి ఉంది అంతే !

ప్రస్తుతం తెలంగాణ విషయానికి వస్తే, కె.సి.ఆర్ అసెంబ్లీని రద్దు చేసిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. చాలామంది ప్రజలతో పాటు టి.ఆర్.ఎస్ మద్దతుదారులు మళ్ళీ తమ పార్టీనే విజయకేతనాన్ని ఎగురవేస్తుందన్న ధీమాను వ్యక్తపరచగా, కొంతమంది ప్రజలలో నెలకొన్న అసంతృప్తి విజయంపై అపనమ్మకాన్ని కలిగిస్తోంది. ఈ పరిస్థితులలో జనసేన ఎవరికి తన మద్దతు తెలుపుతుందన్న ఆసక్తి ప్రజలలో నెలకొంది. తెలంగాణలో పవన్‌కు మంచి అభిమాన గణం ఉండడమే కాకుండా వారే ప్రధాన కార్యకర్త బలాన్ని సమకూరుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.

వాస్తవానికి పవన్ స్వయంగా 2019 తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయాలని అనుకున్నారు, కాని కె.సి.ఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం ఆయనను ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికే ఆయన 20 నుండి 25 అభ్యర్థులను కూడా సిద్దం చేశారు. ప్రజా పోరాట యాత్రలో ఉన్న ఆయన ఒక విలేఖరికి ఈ విషయాన్ని వెల్లడించి ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలలో జనసేన పోటీ చేయదని తేల్చి చెప్పారు. అయితే గతంలో తాను తెలుగు దేశం వైపు నిలిచిన విధంగా ఒక పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.

తెలంగాణలో ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి. అధికార పక్షమైన టి.ఆర్.ఎస్ మళ్ళీ తమ విజయంపై ధీమాగా ఉండగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టేందుకు పావులను కదుపుతోంది. ఈక్రమంలోనే టి.డి.పితో పొత్తును కలుపుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు బి.జె.పి కూడా ఇరు పక్షాల మధ్య ఉన్న సూన్యతను తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తోంది. మరి ఈనేపథ్యంలో జనసేన మద్దతు ఎవరికి ?

ఎట్టి పరిస్థితులలో ఆయన కాంగ్రెస్ పార్టీకి తన మద్దతునైతే తెలుపరు, అది ఖచ్చితంగా చెప్పవచ్చు, ఎందుకంటే రాష్ట్ర విభజనకు కారణమవడమే కాకుండా ఇప్పుడు టి.డి.పితో జతకట్టింది. ఇక మిగిలినవి రెండే పార్టీలు ఒకటి టి.ఆర్.ఎస్ కాగా రెండవది బి.జి.పి, మరి ఈ రెండిటిలో ఆయన దృష్టి దేనివైపు ? ఒకటి మాత్రం నిజం, ఆయన ఎవరికి మద్దతు తెలిపినా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోతే నడి ప్రజల మధ్యన ఏకిపారేయడం తధ్యం, ఎందుకంటే పవన్ ప్రజా నాయకుడు !

ఆంధ్రను ఆక్రమించారు, మరి సీమ సంగతేంటి ?

ఆంధ్రను ఆక్రమించారు, మరి సీమ సంగతేంటి ?

Friday, 12th Oct 2018

సినిమాలను తీసుకుంటే వసూళ్ల పరంగా పవన్ కళ్యాణ్ రారాజు అనే చెప్పాలి. ఆంధ్ర, నైజాం మరియు సీడెడ్ అన్న తేడా లేకుండా తనదైన పంధాలో వసూళ్ల వర్షాన్ని కురిపించారు పవన్. అయితే మరి రాజకీయాల సంగతి ఏమిటి ? ఇక్కడ కూడా ఆయన అదే తరహాలో ఓట్ల వర్షం కురిపిస్తారా ? సినిమాలలో చరిత్రను సృష్టించినంత సునాయాసంగా రాజకీయాలలో కూడా ప్రభావాన్ని చూపుతారా ? చాలా మంది వీరాభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి.

వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇటీవలి కాలంలో పవన్ తన జనసేన పార్టీని ఒంటి చేత్తో విజయ బాటలో నడుపుతున్నారనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు ఆయన వ్యతిరేకించిన తీరు, ప్యాకేజీని అంగీకరించినపుడు చంద్రబాబును ఆయన విమర్శించిన నిజాయితీ, సామాన్య ప్రజానీకానికి ఆయన పట్ల మంచి నమ్మకాన్ని కలిగించాయి. మొదట ఈ రెండు పార్టీలను ఆయనే సమర్ధించినా అప్పటి పరిస్థితులను బట్టి అది ఆమోదించదగినదే అని ప్రజలు నమ్ముతున్నారు.

అందుకే వారి నమ్మకం ప్రస్తుతం పవన్ సాగిస్తున్న ప్రజా పోరాటంలో మద్దతు రూపంలో కనిపిస్తోంది. ఈ యాత్రలో పవన్ ప్రజలతో మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను కూడా చూపుతుండడంతో తమకు కావలసిన బలమైన నాయకుడు పవనే అనే అభిప్రాయం ప్రజలలో కలిగింది. అయితే పవన్ ఇప్పటివరకు ఆంధ్రలోని కొన్ని జిల్లాలలోనే పర్యటించారు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో. అయితే మరి సీమ సంగతేంటి ?