ఆశ్చర్యం కలిగిస్తున్న పవన్, మాయావతిల భేటీ

Wednesday, 24th Oct 2018
ఆశ్చర్యం కలిగిస్తున్న పవన్, మాయావతిల భేటీ

రాజకీయంలో ప్రస్తుతం పవన్ ఆకాశమే హద్దుగా సాగుతున్నారు. ఆయన వేసే ఎత్తులు ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా ఉండడమే కాకుండా ఇప్పుడు జాతీయ మీడియాను సైతం తలతిప్పుకునేలా చేశాయి.

నిన్న టిట్లి తుఫాను బాధితుల సహాయార్ధం పవన్ గవర్నరుకు నివేదికను అందించిన సమయంలో ఎవరికి కూడా పవన్, మాయావతిల భేటీ గురించిన సమాచారం లేదు. ఇప్పుడు ఉన్నఫలంగా పవన్ మాయావతిని కలవడం ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ సంచలనంగా మారిందనే చెప్పాలి. మరి ఈ భేటీ వెనుక పవన్ మస్తిష్కంలో ఏముంది ? ఇరువురు హేమాహేమీలు దేని గురించి చేర్చించుకోనున్నారు ? అనేది నిగూఢ రహస్యమే. తదుపరి వివరాల కోసం జనసేన న్యూస్ చూస్తూనే ఉండండి.