నవంబర్ 2 నుండి జనసేనాని రైలు యాత్ర

Wednesday, 31st Oct 2018
నవంబర్ 2 నుండి జనసేనాని రైలు యాత్ర

సరికొత్త రాజకీయాల ప్రభంజనానికి ఉభయగోదావరి జిల్లాలు సిద్ధమయ్యాయి. ఈ నవంబర్ 2న పవన్ కళ్యాణ్ తన మలి విడత పోరాట యాత్రను మొదలుపెట్టనున్నారు.

ఈ యాత్రను ఒక రైలు మార్గం గుండా రూపొందించగా ప్రజలందరినీ ఆహ్వానించారు. సరిగ్గా మధ్యాహ్నం 1:10 నిమిషాలకు పవన్ విజయవాడ రైల్వేస్టేషన్ నుండి తన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని తగిన పరిష్కారాలను అన్వేషిస్తూనే సాయంత్రం 5:20 నిమిషాలకు అన్నవరం మీదుగా తుని చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు.