ఇక చంద్రబాబు రిటైర్ అవ్వాల్సిందే : పవన్ కళ్యాణ్

Monday, 5th Nov 2018
ఇక చంద్రబాబు రిటైర్ అవ్వాల్సిందే : పవన్ కళ్యాణ్

తుని మరియు కత్తిపూడి సభలకు వచ్చిన భారీ స్పందనను కొనసాగిస్తున్న పవన్ తన ఆలోచనాపూరితమైన ప్రసంగంతో జగ్గంపూడి ప్రజలను కూడా చైతన్యవంతులను చేస్తున్నారు.

సభకు వచ్చిన అసంఖ్యాక జనసందోహంతో మాట్లాడుతూ లోకేష్కు రాజకీయంలో ఇంకా అనుభవం లేదని, అతడు పంచాయితీ శాఖ మంత్రిగా కూడా అనర్హుడని చెప్పారు. అంతేకాకుండా తాను లోకేష్ ముఖ్యమంత్రి కావడానికి టిడిపికి మద్దతు తెలపలేదని, ఇప్పటికైనా చంద్రబాబు వయసును దృష్టిలో ఉంచుకుని పదవీవ్యామోహాన్ని వదిలి కొత్తవారికి అవకాశం కల్పించాలని చమత్కరించారు. కొత్తతరం అంటే నేర చరిత్ర ఉన్నవారు కాదని, సమాజం పట్ల శ్రద్ద ఉన్నవారెవరైనా కావచ్చని పవన్ అన్నారు.