పవన్ ఆగ్రహాన్ని వెలికితీసిన వంతాడ అక్రమ తవ్వకం

Monday, 5th Nov 2018
పవన్ ఆగ్రహాన్ని వెలికితీసిన వంతాడ అక్రమ తవ్వకం

చాలాకాలం తరువాత పవన్ కళ్యాణ్ లోని ఆవేశం కట్టలు తెంచుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడింది. ఇప్పటివరకు సామాన్యుల సమస్యలపై ఎంతో పరిణతితో పాటు ఆలోచనాత్మకంగా స్పందించిన పవన్ వంతాడ ఉదంతంతో ఒక్కసారిగా ఉగ్రరూపమే దాల్చారు.

జగ్గంపేట నియోజకవర్గ ప్రజల ద్వారా వంతాడ అక్రమ తవ్వకాల గురించి తెలుసుకున్న పవన్ వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించాలని భావించారు. అయితే అప్పటికే పవన్ అక్కడికి వస్తున్నదని తెలుసుకున్న నిర్వాహకులు దారికి అడ్డంగా మట్టిని పోసి పవన్కు దారి లేకుండా చేయడం ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీనితో జగ్గంపేట బహిరంగ సభలో అత్యంత ఆవేశంతో మాట్లాడిన పవన్ వంతాడ అక్రమ తవ్వకాల సంగతి తేలుస్తానని హెచ్చరించారు. పవన్ను ఈ ఉదంతం ఎంతగా బాధపెట్టిందో ఆయనలోని ఆవేశం తెలుపుతోందని వెల్లడించిన ఊరి ప్రజలు, త్వరలోనే జనసేనను అధికారంపై కూర్చోబెట్టి అక్రమ తవ్వకాలకు ముగింపు పలుకుతామని వెల్లడించారు.