పవన్ కళ్యాణ్: ఉన్న ఒక్క పాఠశాలకు ఒకే ఒక్క టీచరా

Tuesday, 6th Nov 2018
పవన్ కళ్యాణ్: ఉన్న ఒక్క పాఠశాలకు ఒకే ఒక్క టీచరా

టీడీపీ హయాంలో పవన్ బహిర్గతం చేసిన కుంభకోణాలలో వంతాడ అక్రమ తవ్వకం ఒకటి. గత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఉత్తర్వుల ప్రకారం మొదలైన ఈ అక్రమ తవ్వకం ప్రస్తుత టీడీపీ పాలనలో మరింత పెరిగింది.

ఈనేపథ్యంలో గనుల తవ్వకాలను సందర్శించిన పవన్ స్థానికుల సమస్యలు గురించి తెలుసుకుని అక్రమ్ తవ్వకం గురించి వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సమయంలో తవ్వకం చేపట్టిన సంస్థ స్థానిక ప్రజలకు కనీస అవసరాలను కూడా ఏర్పరచకుండా నియమాలను ఉల్లంఘించిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

ఇదే విషయంపై విలేఖరులతో మాట్లాడుతూ, ఇక్కడి స్థానికులకు కనీసం మంచి తాగు నీరు కూడా లేవని, ఇక్కడ ఉన్న ఒకే పాఠశాలకు ఒకేఒక్క ఉపాధ్యాయుడు ఉండడం దయనీయమని అన్నారు. తన అనుభవంతో చంద్రబాబు ఏదో అభివృద్ధి చేస్తారని జనసేన మద్దతు తెలిపితే ఆయన ఇలా చేస్తే ఎలా ? అని పత్రికా ముఖంగా టీడీపీని ప్రశ్నించారు. అంతేకాకుండా త్వరలోనే తాను మరిన్ని ఆధారాలను సేకరించడంతో పాటు ఇటువంటి తవ్వకాలపై విధానపరమైన కార్యాచరణను రూపొందిస్తానని అన్నారు.