చంద్రబాబు రమ్మంటే స్పెషల్ స్టేటస్ కోసం సిద్దం : పవన్ కళ్యాణ్

Tuesday, 6th Nov 2018
చంద్రబాబు రమ్మంటే స్పెషల్ స్టేటస్ కోసం సిద్దం : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ బీజేపీ కోసం పనిచేసే పార్టీ అని చంద్రబాబు తరచూ వాదిస్తూనే ఉన్నారు. ఆయన మాటలను ఈసారి కొంచెం కఠినంగానే తీసుకున్న పవన్ తాను ఏ రాజకీయ పక్షం కాదని కేవలం ప్రజల పక్షానే ఉంటానని తేల్చి చెప్పారు.

పెద్దాపురంలోని బహిరంగ సభలో ఆయన ఈ విషయంపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీ ఇస్తానన్నపుడు వ్యతిరేకించింది తానే అని, చంద్రబాబు మటుకు మోడీ ఇచ్చిన ప్యాకేజీని కళ్ళకద్దుకుని ఆయనను సన్మానించారని గుర్తుచేశారు. ఇప్పటికీ ప్రత్యేక హోదా కోసం పోరాడదామని చంద్రబాబు ఆహ్వానిస్తే వెళ్ళడానికి తనకేమీ అభ్యంతరం లేదని, కాని అంత ధైర్యం చంద్రబాబుకు ఉందా ? అని పవన్ ప్రశ్నించారు.