అవినీతిపరులను ఎవరినీ సహించేది లేదు : పవన్ కళ్యాణ్

Tuesday, 6th Nov 2018
అవినీతిపరులను ఎవరినీ సహించేది లేదు : పవన్ కళ్యాణ్

ఎవరైనా నన్ను రెచ్చగొడితే వారి అంతు చూస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్. వంతాడ అక్రమ తవ్వకాల గురించి తాను ఆ ప్రదేశాన్ని సందర్శించాలని భావించినప్పుడు కొంతమంది నిర్వాహకులు తనకు అంతరాయం కలిగించాలనుకున్నారు. ఇదే విషయాన్ని పెద్దాపురం బహిరంగ సభలో పంచుకుంటూ పై విధంగా స్పందించారు పవన్.

తాను అందరి రాజకీయ నాయకులలా డబ్బు సంపాదించడానికి రాజకీయాలలోకి రాలేదని, ఒక సినిమా చేసుకుంటే వంద కోట్లు వచ్చే ప్రశాంత జీవితాన్ని విడిచి వచ్చానని పవన్ అన్నారు. నిస్వార్ధంగా ఉండే తనను స్వార్ధ రాజకీయాలతో ఎవరైన విమర్శించినా, అవినీతి రాజకీయాలు చేసుకుంటూ ప్రజల అభివృద్ధికి అడ్డుపడినా వారిని విడిచిపెట్టేది లేదని పవన్ హెచ్చరించారు.