2019 ఎన్నికలకు పవన్ చెప్పిన జోస్యం

Tuesday, 6th Nov 2018
2019 ఎన్నికలకు పవన్ చెప్పిన జోస్యం

ఓటు హక్కు సామాన్యుల వద్ద ఉండే అతి గొప్ప ఆయుధం, దాన్ని సమాజ మార్పు కోసం వాడాలా ? లేక చిన్నపాటి మద్యం సీసాకో, పట్టుచీరకో ఆశపడి అవినీతికి అమ్ముకోవాలా అనేది సామాన్యుడు నిర్ణయించుకోవాలని పవన్ అన్నారు.

పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన సమాజ మార్పు తీసుకురావడంలో టిడిపి నాయకులైన చినరాజప్ప, నారా లోకేష్ మరియు ఇతర నాయకులెవరికీ కూడా భయపడకుండా ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కవితను గుర్తుచేస్తూ, పోరాడితే పోయేదేంలేదు వెధవ బానిస బ్రతుకు తప్ప అని జనాన్ని ఉత్తేజపరిచారు. ఈ క్రమంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలిగినా మద్దతుగా తాను నిలబడతానని పవన్ హామీనిచ్చారు. అంతేకాకుండా వచ్చే 2019 ఎన్నికల గురించి జోస్యం చెబుతూ, అటు టిడిపి కాని ఇటు వైఎస్ఆర్ పార్టీ కాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని, కొన్ని అనూహ్య పరిణామాల మధ్య జనసేన అధికారాన్ని స్థాపించబోతోందని పవన్ ధీమాను వ్యక్తపరిచారు.