ఆంధ్ర ఎంఎల్ఎలకి జనసేనాని హెచ్చరిక

Thursday, 8th Nov 2018
ఆంధ్ర ఎంఎల్ఎలకి జనసేనాని హెచ్చరిక

రోజులు పోతున్న కొద్దీ పవన్ ప్రసంగంలో పదును పెరుగుతోంది. అందుకే సాధారణ రాజకీయ నాయకుల తరహాలో విమర్శలపై దృష్టి సారించడం కాకుండా సమస్యలపై శ్రద్ధను కనబరుస్తున్నారు.

ప్రస్తుతం మలి దశ ప్రజా పోరాట యాత్ర ముగింపు దశకు చేరుకుంటుండగా ఆయన ప్రసంగాలను గమనించినవారికి ఇది స్పష్టం అవుతుంది. అయితే దీని అర్ధం ఆయన రాజకీయ నాయకులను పట్టించుకోవడం మానేసినట్లు కాదనేది పిఠాపురం బహిరంగ సభ ద్వారా తెలుస్తోంది. ఈ ప్రసంగంలో ప్రజల సమస్యలు నుండి అధికార పక్షం ఎంఎల్ఎల వైపు మళ్ళిన పవన్, ప్రజలు ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఎంఎల్ఎలు తామేదో రాజులమైనట్లు ప్రజలు బానిసలైనట్లు చూస్తే మటుకు వారిని గద్దె దించడానికి ఎంతో సమయం లేదని హెచ్చరించారు.