సంవత్సరం వరకు చూసాను : పవన్ కళ్యాణ్

Thursday, 8th Nov 2018
సంవత్సరం వరకు చూసాను : పవన్ కళ్యాణ్

టీడీపీ అధినాయకుడు చంద్రబాబు తమను పవన్ అనవసరంగా లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారని వెల్లడిస్తుండగా కొంతమంది జనసేన వ్యతిరేకులు పవన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. వారందరికీ పిఠాపురం సభలో పవన్ తగిన సమాధానాన్ని ఇచ్చారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే వారి పాలనలోని అవినీతిని గ్రహించానని, కాకపోతే ఇంకా సంవత్సరమే అయింది కనుక వారు తిరిగి తప్పులను సవరించుకుంటారని భావించినట్లు పవన్ తెలిపారు. అయితే అలాంటిదేమీ జరుగుకపోవడంతో తాను వెంటనే మద్దతు ఉపసంహరించుకోవలసి వచ్చిందని, ఒకవేళ టీడీపీ సక్రమమైన పాలన చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ అన్నారు. ఈక్రమంలోనే స్టేజీపై నుండి యువతకు కావలసింది 1500 రూపాయలు కాదని వారికి కావలసింది మంచి ఉద్యోగ భవిష్యత్తు అని ఉద్ఘాటించారు.