నేను ఎన్.టి.ఆర్ అంతటి మంచివాడిని కాను : పవన్ కళ్యాణ్

Thursday, 8th Nov 2018
నేను ఎన్.టి.ఆర్ అంతటి మంచివాడిని కాను : పవన్ కళ్యాణ్

రాజకీయ నాయకులు తరచూ మాట మారుస్తుండడం సామాన్య ప్రజలకు తెలిసిందే. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా పరిస్థితులను బట్టి వారు తమ అభిప్రాయాలను మార్చుకోవడం కొత్తేమీ కాదు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏమీ మినహాయింపు కాదంటున్నారు పవన్ కళ్యాణ్.

పిఠాపురంలోని బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రమే ప్రజల గురించి ఆలోచించేవాడిలా కనిపిస్తారని ఒకసారి పదవిలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షంలో తాను వ్యతిరేకించిన పనులనే మళ్ళీ చేస్తుంటారని పవన్ ఎద్దేవా చేసారు. ఆయన సహజ గుణాన్ని ఇంకా విడమరుస్తూ, చంద్రబాబు మోసం చేయడానికి తాను ఎన్.టి.ఆర్ అంతటి మంచివాడిని కానని, ఇకనైనా ఆయన ప్రజలకు మేలు చేస్తే మంచిదని సూచించారు.