ఎం ఎల్ ఎ వర్మను ప్రజలే తిరిగి పంపిస్తారు : కందుల దుర్గేష్

Friday, 9th Nov 2018
ఎం ఎల్ ఎ వర్మను ప్రజలే తిరిగి పంపిస్తారు : కందుల దుర్గేష్

సెజ్ బాధితులపై ప్రభుత్వం చూపిన అలక్ష్యాన్ని పవన్ ఎప్పుడైతే పిఠాపురం బహిరంగ సభలో బహిర్గతం చేశారో అప్పటినుండి టీడీపీ నాయకులు పవన్ను అనేక విధాలుగా విమర్శిస్తున్నారు. వారిలో పిఠాపురం ఎంఎల్ఎ వర్మ మరింత ముందుకు వెళ్లి తన విజయంలో కాని టీడీపీ విజయంలో కాని పవన్ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేసారు.

ప్రజలకు మంచి చేస్తారని నమ్మి మద్దతు ఇస్తే జనసేనపైనే విమర్శలు చేస్తారా అని చాలామంది జనసైనికులు వర్మకు తగిన సమాధానాన్ని ఇస్తున్నారు. ఈక్రమంలోనే పార్టీ సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్ స్పందిస్తూ వర్మకు పవన్ను విమర్శించే నైతికత లేదని అన్నారు. సెజ్ బాధితులను ఆదుకుంటానని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజల నమ్మకంతో గెలిచిన వర్మ తరువాత టీడీపీతో చేతులు కలిపి ఇప్పుడు ప్లేటు ఫిరాయించారని, ప్రజలకు అతను జవాబు చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఒకవేళ వర్మ చేసిన వాగ్దానాలు వెంటనే అమలు పరచకుంటే ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.