బ్రోకర్ అనే పదానికి వర్మ సరిగ్గా సరిపోతాడు : కళ్యాణ్ దిలీప్

Friday, 9th Nov 2018
బ్రోకర్ అనే పదానికి వర్మ సరిగ్గా సరిపోతాడు : కళ్యాణ్ దిలీప్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెజ్ బాధితుల సమస్యలను ప్రస్తావించినప్పుడు టీడీపీ నాయకుడు, పిఠాపురం ఎంఎల్ఎ వర్మ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో అసలు సమస్యకు కారణం ప్రజారాజ్యంలోని బ్రోకర్లే అని నోరు జారారు. దీనితో స్థానిక ప్రజల నుండే కాక జనసైనికుల నుండి కూడా ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి.

ఈక్రమంలోనే జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన కళ్యాణ్ దిలీప్ మాట్లాడుతూ వర్మ అర్ధం లేకుండా మాట్లాడిన మాటలకు గట్టి సమాధానం చెప్పారు. పిఠాపురంలో అసలు బ్రోకర్ పనులు చేసినట్లు కనిపించేది వర్మ కాగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజలను మోసం చేసి ఆ తరువాత పదవి రాగానే వెంటనే టీడీపీలో కలిసిన మోసకారి స్వభావం వర్మది అని కళ్యాణ్ అన్నారు. ఈ తరహా విజయాన్ని ఆయన సాధించిన ఘనత అనుకుంటే ఈ భూమ్మీద అంతకంటే మూర్ఖుడు ఉండడని అన్నారు. ఇప్పటికైనా వర్మ కళ్ళు తెరచి ప్రజలకు మంచి చేయాలని, వచ్చే ఎన్నికలలో జనసేన పతాకం ఎగరడం ఖాయం కనుక వర్మ పదవికి కొన్ని నెలలు మాత్రమే మిగిలున్నాయని కళ్యాణ్ హెచ్చరించారు.