నోట్ల రద్దుపై చంద్రబాబును ప్రశ్నించిన పవన్

Friday, 9th Nov 2018
నోట్ల రద్దుపై చంద్రబాబును ప్రశ్నించిన పవన్

నోట్ల రద్దు జరిగి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడచినా దీని వలన దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎంత లాభం చేకూరింది ఎంత నష్టం ఏర్పడింది అనేది ఎవరికీ అర్ధంకాని విషయం. ఈ సమయంలో చాలామంది నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో సాహసోపేతమైనది అని కొనియాడినివారున్నారు. అయితే వాస్తవంగా అక్రమ సంపాదన కలిగిన వారు పట్టుబడటం అటుంచితే ఎక్కువగా పేద మరియు మధ్యతరగతి వారే బాధలు పడాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ ద్వారా పంచుకున్న పవన్ బిజెపితో జనసేన పొత్తుపై టీడీపీ సృష్టిస్తున్న వదంతులను కొట్టిపారేసారు. నోట్ల రద్దును మొదట వ్యతిరేకించింది తానే అని చంద్రబాబు ఎంతో వినమ్రంగా మోడీ నిర్ణయాన్ని సమర్ధించారని గుర్తుచేశారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి అసలు మోడీ తీసుకున్న నిర్ణయం తనదే అని కూడా చంద్రబాబు అన్నట్లు గుర్తుచేశారు. అంతేకాకుండా గతంలో ఈ విషయంపై పవన్ మాట్లాడిన మీడియా ఫుటేజ్ను లింకులతో సహా ఉంచి ఇకపై జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని తేల్చారు.